ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. డీఐజీ లా అండ్ ఆర్డర్ పకీరప్ప, డీఐజీ రైల్వేస్ సత్య ఏసుబాబు, నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొని భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, చెక్ పోస్టులు, డ్రోన్ సర్వీలెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా రానున్న ప్రజలు, వాహనాల దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్స్, హోల్డింగ్ పాయింట్లు, రియల్ టైమ్ మానిటరింగ్ చర్యలపై చర్చించారు. బందోబస్తు సిబ్బందికి ఫుడ్, అకామడేషన్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

మహానాడుకు కట్టుదిట్టమైన భద్రత.. పోలీస్ ఉన్నతాధికారుల సమీక్ష