Wednesday, 17 June 2026
  • Home  
  • కూటమి పాలనపై విశ్వాసం పెంచిన రెండేళ్ల సుపరిపాలన-టీడీపీ నేతలు
- తిరుపతి

కూటమి పాలనపై విశ్వాసం పెంచిన రెండేళ్ల సుపరిపాలన-టీడీపీ నేతలు

శ్రీకాళహస్తి, జూన్ 12, (పున్నమి న్యూస్) : ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలను చేరవేస్తూ రెండేళ్లలోనే ఇచ్చిన హామీలను అమలు చేసిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభ విజయవంతానికి తోడ్పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ద్వారా పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది భోజనాలు వడ్డించడం ప్రభుత్వ సంక్షేమ దృక్పథానికి నిదర్శనమన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమలవుతున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద లక్షలాది మంది రైతులకు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించి వ్యవసాయ రంగానికి బలమైన అండగా నిలిచిందని పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా లక్షలాది గృహాలను లబ్ధిదారులకు అందించడంతో పాటు మరిన్ని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా. ఎం. ఉమేష్‌రావు, కాసరం రమేష్, వజ్రం కిషోర్, డిల్లీ బాబు, పేట బాలాజీ, కుమార్, కోట చంద్రశేఖర్, ఎంఎస్ రెడ్డి, అనిల్, రాము, రామ్మూర్తి, రాకేష్, నవీన్, కోలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.