శ్రీకాళహస్తి, జూన్ 12, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశిని పురస్కరించుకుని శుక్రవారం ప్రదోషకాల పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారితో పాటు నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, విభూతి తదితర పవిత్ర ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బిల్వపత్రాలు, సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

త్రయోదశి సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు