శ్రీకాళహస్తి, జూన్ 12, (పున్నమి న్యూస్) : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పేడు మండలంలోని కొత్తచెరువు కండ్రిగ, పాయల్ సెంటర్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి సుమలత మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రతి చిన్నారికి విద్యను అభ్యసించే హక్కు ఉందని, పిల్లలను పనుల్లో నిమగ్నం చేయడం చట్టవిరుద్ధమని వివరించారు. గ్రామాల్లో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలని సూచించారు. పిల్లల బాల్యాన్ని పరిరక్షించి, విద్య ద్వారా వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి సంస్థ ప్రతినిధులు రాజేశ్వరమ్మ, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాల్యానికి బాటలు వేయాలి.. బాలకార్మికత్వానికి చెక్ పెట్టాలి