శ్రీకాళహస్తి, జూన్ 12, (పున్నమి న్యూస్) : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సారథ్యంలో చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పాల్గొని సంఘీభావం ప్రకటించారు. స్థానిక రామసేతు వంతెన వద్ద ప్రారంభమైన ర్యాలీ వైఎస్సార్ సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమ పథకాలు, రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్న హామీలు నెరవేరలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాల లబ్ధి ప్రస్తుతం ప్రజలకు అందడం లేదని పేర్కొంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ