శ్రీకాళహస్తి, జూన్ 12, (పున్నమి న్యూస్) : కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి ప్రస్థాన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొనేందుకు తిరుపతి దామినేడు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తిరుపతి విమానాశ్రయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పారదర్శకత, సుపరిపాలనతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దామినేడు వద్ద నిర్వహిస్తున్న విజయోత్సవ సభ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, అభిమానులు పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ముక్కంటి ఆలయ చైర్మన్ కొట్టే సాయి