Saturday, 13 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తా-అనంత్ అంబానీ
- తిరుపతి

శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తా-అనంత్ అంబానీ

శ్రీకాళహస్తి, జూన్ 12, (పున్నమి న్యూస్) : ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు, యువ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంత్ అంబానీ ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ప్రతినిధులు ఆయనకు శ్రీకాళహస్తి క్షేత్ర ప్రాశస్త్యం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, దేశ విదేశాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక ప్రాధాన్యంపై వివరించారు. అలాగే వేల ఏళ్ల చరిత్ర కలిగిన గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం విశిష్టతను కూడా తెలియజేశారు. ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అనంత్ అంబానీ, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల నాటికి శ్రీకాళహస్తి మరియు గుడిమల్లం ఆలయాల అభివృద్ధి కోసం తన వంతు ఆర్థిక సహకారం, అవసరమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారని స్థానిక ప్రతినిధులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.