ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, డిప్లొమా చదివే విద్యార్థినులకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. అర్హత కలిగిన ప్రతి విద్యార్థినికి రూ.30 వేల ఆర్థిక సాయం అందనుంది. 2026–27 విద్యా సంవత్సరంలో డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థినులు ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉండాలి. కోర్సును బట్టి స్కాలర్‌షిప్ రెండు నుంచి ఐదేళ్ల వరకు కొనసాగనుంది. తొలి విడత దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది. రెండో విడతలో జనవరి 1 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదే సమయంలో అమలాపురం, తిరుపతిలో బీసీ విద్యార్థుల కోసం రెండు ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్‌తో పాటు జేఈఈ, నీట్ శిక్షణ కూడా అందించనున్నారు.

ఏపీలో డిగ్రీ చదివే అమ్మాయిలకు రూ.30 వేల స్కాలర్‌షిప్.. ఆగస్టు 31లోపు దరఖాస్తు