ఏన్కూరులో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, సాంకేతిక రంగానికి, యువతకు రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


