Friday, 14 August 2026
  • Home  
  • ఏటికొప్పాకలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
- అనకాపల్లి

ఏటికొప్పాకలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

యలమంచిలి, ఆగస్టు 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): దేశభక్తి నినాదాలతో ఏటికొప్పాక గ్రామం మార్మోగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏటికొప్పాకలో శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా గ్రామం మొత్తం కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూనిన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కుమార్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి శ్రీను, లావేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో ముందుకు సాగుతూ దేశ ఐక్యత, సమైక్యతను చాటారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో ఎటుచూసినా త్రివర్ణ పతాకాలు కనిపించడంతో ఏటికొప్పాకలో దేశభక్తి వాతావరణం నెలకొంది. జైహింద్‌ నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

యలమంచిలి, ఆగస్టు 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
దేశభక్తి నినాదాలతో ఏటికొప్పాక గ్రామం మార్మోగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏటికొప్పాకలో శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా గ్రామం మొత్తం కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూనిన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు.
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కుమార్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి శ్రీను, లావేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో ముందుకు సాగుతూ దేశ ఐక్యత, సమైక్యతను చాటారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో ఎటుచూసినా త్రివర్ణ పతాకాలు కనిపించడంతో ఏటికొప్పాకలో దేశభక్తి వాతావరణం నెలకొంది.
జైహింద్‌ నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.