విశాఖపట్నం జిల్లా, భీమిలి, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): భీమిలి నియోజకవర్గం 8వ వార్డు గుడ్లవానిపాలెంకు చెందిన గుడ్ల నరసింగరావు, కొడమటి నర్సింగరావు, గుడ్ల అప్పలస్వామి (బుజ్జి), ఎరుసు అప్పలరెడ్డి జనసేన పార్టీలో చేరారు. భీమిలి జనసేన ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సందీప్ పంచకర్ల నాయకత్వం, వార్డు అధ్యక్షుడు శాఖరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో AMC చైర్మన్ కురిమిన రామస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.









