Wednesday, 30 September 2026
  • Home  
  • ఆపరేషన్ త్రిషూల్ – నేర రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ ‘కవచం’!*
- తిరుపతి

ఆపరేషన్ త్రిషూల్ – నేర రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ ‘కవచం’!*

– పారిశ్రామిక రీజియన్ లో రక్షణ పటిష్టం – మాదకద్రవ్యాలు, మహిళల భద్రత, రహదారి నిబంధనలపై ప్రత్యేక నిఘా – సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ప్రణాళిక *తిరుపతి జిల్లా బ్యూరో / ఎన్ టైమ్స్* తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట రాష్ట్రంలో మారుతున్న సామాజిక, పారిశ్రామిక పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వ్యూహాలకు వరుస పెడుతోంది. అందులో భాగంగానే నేరాల నిర్మూలన, ప్రజల సమగ్ర భద్రత ధ్యేయంగా సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో ‘ఆపరేషన్ త్రిషూల్’ పేరిట ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, నాయుడుపేట డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ జె. చెంచుబాబు పర్యవేక్షణలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేస్తున్నట్లు సూళ్లూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ వెల్లడించారు. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారికి సమీపంలో ఉంటూ, పారిశ్రామికంగా వేగంగా అడుగులు వేస్తున్న సూళ్లూరుపేట, తడ ప్రాంతాలు నేడు వేలాది మందికి ఉపాధి కేంద్రాలుగా మారాయి. శ్రీసిటీ వంటి అంతర్జాతీయ పారిశ్రామిక ఎస్టేట్లతో పాటు అనుబంధ పరిశ్రమలు రావడంతో ఇక్కడ రవాణా వ్యవస్థ నిత్యం రద్దీగా మారింది. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఇక్కడ నివాసముంటున్నారు. ఈ వేగవంతమైన పట్టణీకరణ నేరస్తులకు, మత్తు ముఠాలకు స్థావరంగా మారకుండా నిరోధించడానికే పోలీస్ శాఖ ‘ఆపరేషన్ త్రిషూల్’ను రంగంలోకి దించింది. ‘త్రిశూల్ మూడు పదునైన అస్త్రాలు 1. మాదకద్రవ్యాల నిర్మూలన యువతను, పరిశ్రమల కార్మికులను టార్గెట్ చేస్తూ సాగుతున్న గంజాయి, సింథటిక్ డ్రగ్స్ విక్రయాలపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి రవాణా, వినియోగం, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. విద్యాసంస్థలు, పారిశ్రామిక లేబర్ కాలనీల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు, కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 2. మహిళలు, చిన్నారుల భద్రత మహిళల హక్కుల రక్షణ, వారి ఆత్మగౌరవ పరిరక్షణకు ఆపరేషన్ త్రిషూల్ అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. సున్నా సహనం ఈవ్ టీజింగ్, వేధింపులు, లైంగిక నేరాలకు పాల్పడే వారిపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్ కు గానీ, అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లకు గానీ సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పెట్రోలింగ్ ను తీవ్రతర చేశారు. 3. రహదారి భద్రత మరియు విజిబుల్ (రోడ్ సేఫ్టీ) అంశాల్లో ఉండే జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లపై నిత్యం జరిగే ప్రమాదాలను అరికట్టడానికి వాహన తనిఖీలను కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వాడాలని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం (రాష్ లాన్) నేరాలపై జరిమానాలతో పాటు వాహనాల సీజ్, డ్రైవింగ్ లైసెన్సుల రద్దు ప్రతిపాదనలు పంపుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా బాధ్యులను చేస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాలపై ప్రత్యేక అప్రమత్తత సాంకేతికత పెరుగుతున్న కొద్దీ అమాయక ప్రజలే లక్ష్యంగా సైబర్ ముఠాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండాలని సీఐ మురళీకృష్ణ కోరారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అడిగితే బ్యాంకింగ్ వివరాలు, సీవీవీ నంబర్లు, ఓటీపీలు లేదా పర్సనల్ సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ రాబోయే ఎన్నికల దృష్ట్యా సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు సీఐ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు, ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా పూర్తి స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించేవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని సీఐ ఎం. మురళీకృష్ణ హెచ్చరించారు.

– పారిశ్రామిక రీజియన్ లో రక్షణ పటిష్టం
– మాదకద్రవ్యాలు, మహిళల భద్రత, రహదారి నిబంధనలపై ప్రత్యేక నిఘా
– సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ప్రణాళిక

*తిరుపతి జిల్లా బ్యూరో / ఎన్ టైమ్స్*

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట రాష్ట్రంలో మారుతున్న సామాజిక, పారిశ్రామిక పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వ్యూహాలకు వరుస పెడుతోంది. అందులో భాగంగానే నేరాల నిర్మూలన, ప్రజల సమగ్ర భద్రత ధ్యేయంగా సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో ‘ఆపరేషన్ త్రిషూల్’ పేరిట ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, నాయుడుపేట డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ జె. చెంచుబాబు పర్యవేక్షణలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేస్తున్నట్లు సూళ్లూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ వెల్లడించారు. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారికి సమీపంలో ఉంటూ, పారిశ్రామికంగా వేగంగా అడుగులు వేస్తున్న సూళ్లూరుపేట, తడ ప్రాంతాలు నేడు వేలాది మందికి ఉపాధి కేంద్రాలుగా మారాయి. శ్రీసిటీ వంటి అంతర్జాతీయ పారిశ్రామిక ఎస్టేట్లతో పాటు అనుబంధ పరిశ్రమలు రావడంతో ఇక్కడ రవాణా వ్యవస్థ నిత్యం రద్దీగా మారింది. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఇక్కడ నివాసముంటున్నారు. ఈ వేగవంతమైన పట్టణీకరణ నేరస్తులకు, మత్తు ముఠాలకు స్థావరంగా మారకుండా నిరోధించడానికే పోలీస్ శాఖ ‘ఆపరేషన్ త్రిషూల్’ను రంగంలోకి దించింది. ‘త్రిశూల్ మూడు పదునైన అస్త్రాలు 1. మాదకద్రవ్యాల నిర్మూలన యువతను, పరిశ్రమల కార్మికులను టార్గెట్ చేస్తూ సాగుతున్న గంజాయి, సింథటిక్ డ్రగ్స్ విక్రయాలపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి రవాణా, వినియోగం, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. విద్యాసంస్థలు, పారిశ్రామిక లేబర్ కాలనీల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు, కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 2. మహిళలు, చిన్నారుల భద్రత మహిళల హక్కుల రక్షణ, వారి ఆత్మగౌరవ పరిరక్షణకు ఆపరేషన్ త్రిషూల్ అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. సున్నా సహనం ఈవ్ టీజింగ్, వేధింపులు, లైంగిక నేరాలకు పాల్పడే వారిపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్ కు గానీ, అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లకు గానీ సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పెట్రోలింగ్ ను తీవ్రతర చేశారు. 3. రహదారి భద్రత మరియు విజిబుల్ (రోడ్ సేఫ్టీ) అంశాల్లో ఉండే జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లపై నిత్యం జరిగే ప్రమాదాలను అరికట్టడానికి వాహన తనిఖీలను కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వాడాలని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం (రాష్ లాన్) నేరాలపై జరిమానాలతో పాటు వాహనాల సీజ్, డ్రైవింగ్ లైసెన్సుల రద్దు ప్రతిపాదనలు పంపుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా బాధ్యులను చేస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాలపై ప్రత్యేక అప్రమత్తత సాంకేతికత పెరుగుతున్న కొద్దీ అమాయక ప్రజలే లక్ష్యంగా సైబర్ ముఠాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండాలని సీఐ మురళీకృష్ణ కోరారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అడిగితే బ్యాంకింగ్ వివరాలు, సీవీవీ నంబర్లు, ఓటీపీలు లేదా పర్సనల్ సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ రాబోయే ఎన్నికల దృష్ట్యా సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు సీఐ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు, ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా పూర్తి స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించేవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని సీఐ ఎం. మురళీకృష్ణ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.