*వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వర్ల రామయ్య గారికి ఘన సత్కారం*
03.09.2026
*ఇబ్రహీంపట్నం ముత్తవరపు కళ్యాణ మండపం నందు మైలవరం శాసనసభ్యులు గౌరవ వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కూటమి నాయకులు నూతనంగా నియమితులైన శాసనమండలి సభ్యులు గౌరవ వర్ల రామయ్య గారికి ఘనంగా సన్మానించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ పాల్గొని వర్ల రామయ్య గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలియజేశారు. వర్ల రామయ్య గారి నీతి, నిబద్దత నేడు మండలి సభ్యులుగా అవకాశం కల్పించారని, పొలీట్ బ్యూరో సమావేశంలో దళితుల హాక్కులు కోసం కృషి చేశారని తెలిపారు.*




