ఓబులవారిపల్లె మండలం కటికంవారిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఆర్ సూపర్‌మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కటికం నాగేంద్ర ఆహ్వానం మేరకు ఆయన సోదరి కటికం రాజేశ్వరి ఏర్పాటు చేసిన సూపర్‌మార్ట్‌ను రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థ ప్రజలకు ఉపయోగపడేలా నాణ్యమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని ఆకాంక్షించారు. వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా వ్యాపారాన్ని విస్తరించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌ఆర్ సూపర్‌మార్ట్ ప్రారంభం
ఓబులవారిపల్లె మండలం కటికంవారిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఆర్ సూపర్‌మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కటికం నాగేంద్ర ఆహ్వానం మేరకు ఆయన సోదరి కటికం రాజేశ్వరి ఏర్పాటు చేసిన సూపర్‌మార్ట్‌ను రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థ ప్రజలకు ఉపయోగపడేలా నాణ్యమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని ఆకాంక్షించారు. వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా వ్యాపారాన్ని విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

