నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. “స్త్రీ శక్తి” థీమ్‌తో మహిళా సాధికారతపై ప్రత్యేక చర్చలు నిర్వహించారు. భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు మహానాడు కార్యక్రమాలను వీక్షించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, మహిళలు, యువత పాల్గొని వేడుకలకు ఉత్సాహాన్ని తీసుకువచ్చారు.

ఉదయగిరి నియోజకవర్గంలో ఘనంగా మహానాడు వేడుకలు