ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ముథోల్ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) సిబ్బందికి అవార్డులు అందజేశారు. సీహెచ్‌సీ ముథోల్ వైద్యుడు డా. మల్లికార్జున్, హెడ్ నర్స్ సరోజ, హెల్త్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. జాదవ్ అనిల్ కుమార్, వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అవార్డు గ్రహీతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని గుర్తించి అవార్డులు అందించడం ఇతర సిబ్బందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.



