Saturday, 29 August 2026
  • Home  
  • కలెక్టరేట్ లో రక్షాబంధన్ వేడుకలు
- జయశంకర్ భూపాలపల్లి

కలెక్టరేట్ లో రక్షాబంధన్ వేడుకలు

రాఖీ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ మహిళా సిబ్బంది జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సహోదరత్వం, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని స్మరించుకున్నారు. కార్యాలయ విధుల నిర్వహణలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న మార్గదర్శకత్వం, సహకారానికి మహిళా సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మహిళా అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, వారి సంక్షేమం, భద్రతకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సీనియర్ సహాయకులు విజయ, అనురాధ, సుమలత, జూనియర్ సహాయకులు మౌనిక తదితరులు పాల్గొన్నారు.

రాఖీ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ మహిళా సిబ్బంది జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సహోదరత్వం, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని స్మరించుకున్నారు. కార్యాలయ విధుల నిర్వహణలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న మార్గదర్శకత్వం, సహకారానికి మహిళా సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మహిళా అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, వారి సంక్షేమం, భద్రతకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సీనియర్ సహాయకులు విజయ, అనురాధ, సుమలత, జూనియర్ సహాయకులు మౌనిక
తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.