Sunday, 30 August 2026
  • Home  
  • టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా
- అన్నమయ్య

టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా

చెక్ అందజేసిన టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గం, ఆగస్టు 29: తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన పార్టీ కార్యకర్త వెంకటయ్య ముద్దపాలు కుటుంబానికి పార్టీ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు.కోడూరు మండలం సెట్టిగుంటకు చెందిన వెంకటయ్య ముద్దపాలు అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా పార్టీ సభ్యత్వానికి అనుసంధానమైన ప్రమాద బీమా మొత్తాన్ని మంజూరు చేశారు.రూ.5,00,000 ప్రమాద బీమా చెక్కును వెంకటయ్య ముద్దపాలు నామినీ కాంతమ్మ ముద్దపాలుకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం సేవలందించిన ప్రతి కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.ప్రమాద బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపద సమయంలో కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయని అన్నారు. వెంకటయ్య ముద్దపాలు కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.