ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సేవలపై ప్రజల స్పందనను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన క్యూ ఆర్ కోడ్‌ను తహసీల్దార్ రామ్మోహన్ రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి PGRS సేవలపై తమ అభిప్రాయాలు, సూచనలు, ఫీడ్‌బ్యాక్‌ను సులభంగా నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇలాంటి క్యూ ఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో PGRS ఫీడ్‌బ్యాక్ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరణ