Friday, 22 May 2026
  • Home  
  • ఇంద్రపార్క్‌ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- E-పేపర్

ఇంద్రపార్క్‌ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ఇంద్రపార్క్‌ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పున్నమి న్యూస్ 22 మే 2026 ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆడాల గణేష్ హైదరాబాద్‌లోని ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించిన సెంట్రింగ్ కార్మికుల ధర్నా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఆడాల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవనం కష్టమవుతోందని, సెంట్రింగ్ కార్మికులకు సరైన వేతనాలు, భద్రతా చర్యలు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని వారు కోరారు.

ఇంద్రపార్క్‌ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నా
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

పున్నమి న్యూస్
22 మే 2026

ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆడాల గణేష్
హైదరాబాద్‌లోని ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించిన సెంట్రింగ్ కార్మికుల ధర్నా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఆడాల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవనం కష్టమవుతోందని, సెంట్రింగ్ కార్మికులకు సరైన వేతనాలు, భద్రతా చర్యలు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.