==============================
ఆనందపురం, 19 ( పున్నమి ప్రతినిధి)
ఆనందపురం జంక్షన్‌లో పెందుర్తి వెళ్లే రూట్ బస్‌స్టాప్ సమీపంలోని కూరగాయల మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాలు, కోడి చెత్తను రోడ్డు పక్కనే వేయడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో బస్‌స్టాప్ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పందులు, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే చెత్త తొలగించి మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను రోడ్లపై పడేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.


