అన్నదానం, సేవా కార్యక్రమాలు, సిబ్బందికి ప్రత్యేక సన్మానాలు – దాత మట్లి సురేందర్ రెడ్డి సేవలను కొనియాడిన నాయకులు
ఆత్మకూరు, జూలై 10 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దాత, టీడీపీ నాయకులు మెట్ల సురేందర్ రెడ్డి ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజా సేవలను స్మరించుకుంటూ ఆయన సుదీర్ఘ రాజకీయ, ప్రజాసేవా ప్రస్థానాన్ని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని నాయకులు పేర్కొన్నారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా ముందుగా 74 కేజీల కేక్ కట్ చేసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలను నిర్వహించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, పార్టీ కార్యకర్తలు నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు.
ఈ సందర్భంగా దాత మట్లి సురేందర్ రెడ్డి తన సేవాభావాన్ని చాటుతూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, మెప్మా (MEPMA) సిబ్బంది, విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ప్రజలకు సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని పేర్కొంటూ వారికి అవసరమైన ఉపయోగకరమైన వస్తువులను పంపిణీ చేశారు. అలాగే ఆనం సంజీవ రెడ్డి డిగ్రీ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విధ్యార్డీ విధ్యార్డునులకు కూడా బహుమతులు అందజేసి వారిని అభినందించారు.
అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ భారీ స్తాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు, విద్యార్థులు అన్నదానంలో పాల్గొని భోజనం చేశారు. జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజల సంక్షేమం, దేవాదాయ శాఖ అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఆత్మకూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.
దాత మెట్ల సురేందర్ రెడ్డి సేవలను ప్రత్యేకంగా అభినందించిన నాయకులు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకు పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుర భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులీమి శైలజా రెడ్డి, ఎంపీపీ కే. వేణుగోపాల్ రెడ్డి, సీఐ గంగాధర్, ఎస్సై జంపాని కుమార్, బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాములు, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, పలువురు మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, మహిళలు, యువత, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు సేవా కార్యక్రమాలు, అన్నదానం, ప్రజా భాగస్వామ్యంతో ఆత్మకూరులో విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఒకే వేదికపై కలిసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో కార్యక్రమం మరింత ప్రత్యేకత సంతరించుకుంది.



