తిరుపతి, ఆగష్టు 20, పున్నమి ప్రతినిధి
తిరుపతి లోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు అమరావతి ఛాంపియన్షిప్ – 2026 రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం 10 క్రీడాంశాల్లో అండర్-22 విభాగంలో క్రీడా పోటీలను నిర్వహించామని, అదే విధంగా ఈ సంవత్సరం అమరావతి ఛాంపియన్‌షిప్ ను మొత్తం 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో సుమారు 2 లక్షల మంది క్రీడాకారులు భాగస్వామ్యం కావడం రాష్ట్ర క్రీడా రంగంలో ఒక విశేషమైన ముందడుగు అని పేర్కొన్నారు.
అలాగే, ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు శాప్ చైర్మన్ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ ను విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, వసతి, క్రీడా వేదికలు తదితర అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపడుతున్నామని రవి నాయుడు వెల్లడించారు.


