*నాయుడుపేట:*పున్నమి న్యూస్
ఉమ్మడి నెల్లూరు జిల్లా పక్కనే ఉన్న సూళ్లూరుపేట పట్టణంలో మున్సిపాలిటీ, స్థానిక నాయకుల చొరవతో ప్రధాన కూడళ్లలో, హైవేల వద్ద ఆకర్షణీయమైన “ఐ లవ్ సూళ్లూరుపేట” బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి వచ్చే ప్రయాణికులు, యువత సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో ఆ ప్రాంతాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు.
మరి అంతకంటే పెద్ద పట్టణం, వ్యాపార కేంద్రం అయిన *నాయుడుపేటలో మాత్రం ఇప్పటివరకు “ఐ లవ్ నాయుడుపేట” సెల్ఫీ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు?* అని స్థానిక యువత, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నాయుడుపేట గుండా రోజూ వేలాది వాహనాలు, చెన్నై-కోల్ కతా హైవే మీదుగా ప్రయాణికులు వెళ్తున్నా, ఒక్క సెల్ఫీ పాయింట్ కూడా లేకపోవడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సూళ్లూరుపేట లాంటి చిన్న పట్టణంలో సాధ్యమైనది, నాయుడుపేటలో ఎందుకు సాధ్యం కాదు? నాయుడుపేట మున్సిపాలిటీ నిద్రపోతోందా? స్థానిక నాయకులకు చిత్తశుద్ధి లేదా?
*ప్రజల డిమాండ్:* ఇప్పటికైనా నాయుడుపేట మున్సిపల్ అధికారులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే *డాక్టర్ నెలవల విజయశ్రీ* గారు తక్షణమే స్పందించి, నాయుడుపేటలోని ప్రధాన కూడలి లేదా బస్టాండ్, హైవే పక్కన ఆకర్షణీయమైన “ఐ లవ్ నాయుడుపేట” బోర్డును ఏర్పాటు చేయాలని యువత డిమాండ్ చేస్తోంది.
ఏర్పాటు చేస్తారో లేదో వేచి చూద్దాం మరి…!


