పోలవరం నుంచి అనకాపల్లి వరకు జలకళ — చంద్రబాబు విజన్‌కు సాకారం
విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 2::: చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా కీలక అడుగు పడింది. పోలవరం నుంచి అనకాపల్లి వరకు సాగునీటిని అందించే పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర రైతాంగంలో కొత్త ఆశలు నింపింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, విజన్‌కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమంపై చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.
కాల్వలో ప్రవహించే నీరు కేవలం జలధార కాదు… రైతు కన్నీటికి సమాధానం, పంట పొలాలకు ప్రాణధారం, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు ఆశాకిరణం.
పోలవరం జలాలు ఉత్తరాంధ్ర భూములను తడపడంతో వ్యవసాయానికి మరింత ఊతం లభించడంతో పాటు రైతుల జీవితాల్లో సంతోషం వెల్లివిరిసే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
**“నీరు పారితే పొలం పచ్చబడుతుంది..
పొలం పచ్చబడితే రైతు బతుకు పండుతుంది..
రైతు బతుకు పండితే ఉత్తరాంధ్ర అభివృద్ధి పరుగులు తీస్తుంది!”**
పోలవరం జలాలు… ఉత్తరాంధ్ర రైతు ఆశలకు కొత్త ఊపిరి!




