ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలను బ్రాహ్మణపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉదయగిరి బూత్ అధ్యక్షుడు యర్రగూటి చెంచురెడ్డి, మండల ఆర్టీఐ ప్రెసిడెంట్ దేవరపు మధుచౌదరి, దక్కనూరు యువత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింతకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.


