Friday, 11 September 2026
  • Home  
  • 22ఏ పేరుతో రైతుల వేధింపులు ఆపాలి: బీజేపీ
- ఖమ్మం

22ఏ పేరుతో రైతుల వేధింపులు ఆపాలి: బీజేపీ

22Aపేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నారపురాజు రామచంద్రరావు పిలుపుమేరకు గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు సాగు చేసుకుంటున్న భూములు, పేదలు కష్టార్జితంతో సంపాదించుకున్న చిన్న కుటుంబాల భూములు, ఇళ్ల స్థలాలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదన్నారు. తమ సొంత భూముల సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. భూముల సమస్య పరిష్కారం పేరుతో బేరసారాలకు తావిచ్చే పరిస్థితులు కల్పించడం సిగ్గుచేటన్నారు. రైతుల భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే 22ఏ పేరుతో వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి అర్హులైన రైతుల భూములను వెంటనే తొలగించాలని, రైతులపై వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల భూముల పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.