Friday, 4 September 2026
  • Home  
  • సినిమా హాలు వద్ద చెత్త సమస్యపై చర్యలు తీసుకోవాలి
- అన్నమయ్య

సినిమా హాలు వద్ద చెత్త సమస్యపై చర్యలు తీసుకోవాలి

కోడూరు గ్రామ పంచాయతీ కార్యదర్శికి శ్రీనివాసులు మరోసారి వినతి రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీనివాస సినిమా హాలు పరిసరాల్లో పేరుకుపోతున్న చెత్త సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని అబ్బూరి శ్రీనివాసులు కోడూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిని కోరారు.సినిమా హాలు ముందుభాగంలోని కాంపౌండ్ గోడ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కొందరు తమ ఇళ్ల చెత్తను అక్రమంగా వేస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే బ్రిడ్జి పక్కనున్న సర్వీసు రోడ్డుపై పడేస్తున్న చెత్తలోని ప్లాస్టిక్ కవర్లు గాలికి ఖాళీ స్థలంలోకి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని అరికట్టేందుకు సర్వీసు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్థంభాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా హాలు ముందు రోడ్డుతో పాటు ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాల పరిశుభ్రతను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా పారిశుధ్య కార్మికులు చెత్తను తరలించకుండా ఖాళీ స్థలంలోనే కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు. చెత్తను కాల్చకుండా ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించేలా సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.సినిమా హాలు దక్షిణ భాగంలోని కాంపౌండ్ గోడ కొంత మేర దెబ్బతినడంతో కొందరు ఆ ప్రదేశంలోకి చెత్త వేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీనివాస నగర్, చిట్వేలి రోడ్డులో మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో అక్రమ చెత్త పారవేతను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.పరిసరాల పరిశుభ్రతను కాపాడి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా గ్రామ పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని అబ్బూరి శ్రీనివాసులు మరోసారి కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.