విశాఖ గాజువాక : (పున్నమి ప్రతినిధి) కూర్మన్నపాలెం 87వ వార్డు గణేష్‌నగర్‌లో దుర్గా నగర్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వైఎస్సార్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లపు రాము, 87వ వార్డు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వృద్ధులు, వికలాంగులు, పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, 108 వంటి ప్రజా సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల హృదయాల్లో వైఎస్సార్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
కార్యక్రమంలో ప్రగడ వేణుబాబు, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, అప్పిని సన్యాసిరావు, మార్పు గోవింద, మేస్త్రి కృష్ణ, జెర్రిపోతుల ఆదినారాయణ, ఈ.సంతోష్, ఎస్.రవి, ఎస్.ఈశ్వరరావు, డి.అప్పడు తదితరులు పాల్గొన్నారు.




