Friday, 4 September 2026
  • Home  
  • రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపు తుది జాబితా ను పారదర్శకంగా ఖరారు చేయాలి :కలెక్టర్
- జనగాం

రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపు తుది జాబితా ను పారదర్శకంగా ఖరారు చేయాలి :కలెక్టర్

రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుకు తుది జాబితాను పారదర్శకంగా ఖరారు చేయాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ————————————————————- జనగామ, సెప్టెంబర్ 3,పున్నమి జిల్లా ప్రతినిధి : లక్కీ డ్రా ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలో రెండు పడక గదుల (2BHK) ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్వహించి, అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు. బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 2BHK ఇళ్ల కేటాయింపుకు సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా ఖరారుపై *డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 1,137 రెండు పడక గదుల ఇళ్లు కేటాయించనైన నేపథ్యంలో, ప్రజల పరిశీలనార్థం అర్హుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించి, నిజమైన అర్హులకే ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. L2 లబ్ధిదారుల జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించాలని తెలిపారు. అలాగే అర్హత కలిగిన ఇతర లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు (లేదా) అభ్యంతరాలను వాటిని పరిశీలించి, తుది జాబితాలో పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి, తుది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం లక్కీ డ్రా నిర్వహించి, పూర్తిస్థాయి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై ప్రజలకు పూర్తి సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి దశలో పారదర్శకత, నిష్పాక్షికత, నిబంధనలను అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుకు తుది జాబితాను పారదర్శకంగా ఖరారు చేయాలి:
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
————————————————————-
జనగామ, సెప్టెంబర్ 3,పున్నమి జిల్లా ప్రతినిధి :
లక్కీ డ్రా ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలో రెండు పడక గదుల (2BHK) ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్వహించి, అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు.
బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 2BHK ఇళ్ల కేటాయింపుకు సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా ఖరారుపై *డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 1,137 రెండు పడక గదుల ఇళ్లు కేటాయించనైన నేపథ్యంలో, ప్రజల పరిశీలనార్థం అర్హుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించి, నిజమైన అర్హులకే ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
L2 లబ్ధిదారుల జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించాలని తెలిపారు. అలాగే అర్హత కలిగిన ఇతర లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు (లేదా) అభ్యంతరాలను వాటిని పరిశీలించి, తుది జాబితాలో పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు.
గ్రామస్థాయిలో వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి, తుది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం లక్కీ డ్రా నిర్వహించి, పూర్తిస్థాయి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు.
ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై ప్రజలకు పూర్తి సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి దశలో పారదర్శకత, నిష్పాక్షికత, నిబంధనలను అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.