పున్నమి ప్రతినిధి / నెల్లూరు
ఈ రోజు (11.12.2025) అబైడింగ్ హోప్ ట్రస్ట్ కార్యాలయంలో 50 మంది క్యాన్సర్ రోగులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. డైరెక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, గత 12 నెలలుగా నిరంతరంగా పౌష్టికాహారం అందిస్తున్నామని, నూతన సంవత్సరంలో 100 మంది క్యాన్సర్ పేషెంట్స్‌కు ఉచిత న్యూట్రిషన్ అందించే లక్ష్యం ఉందని తెలిపారు.
ముఖ్య అతిథి క్యాన్సర్ హాస్పిటల్ కౌన్సిలర్ శ్రీమతి కన్యాకుమారి మాట్లాడుతూ, క్యాన్సర్ రోగుల ఆరోగ్యం కోసం ప్రోటీన్ ఫుడ్, మల్టిగ్రెయిన్, ఎనర్జీ సప్లిమెంట్స్, డ్రై ఫ్రూట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
పత్రికా రచయిత శ్రీ జయప్రకాశ్ మాట్లాడుతూ, పౌష్టికాహారం రోగ నిరోధక శక్తిని పెంచి, శారీరక–మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిస్టర్ రమ, జయ, నిర్మలా తదితరులు పాల్గొన్నారు.


