Monday, 22 June 2026
  • Home  
  • అమోనియా లీక్ ఘటనపై తమిళనాడు సీఎం విచారణ కమిటీ
- Featured

అమోనియా లీక్ ఘటనపై తమిళనాడు సీఎం విచారణ కమిటీ

తిరువள்ளూర్‌లోని సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్‌లో అమోనియా లీక్ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మూడు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పరిశ్రమ భద్రతా శాఖ డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ అదనపు డైరెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 24 గంటల్లో ప్రాథమిక నివేదిక, మూడు రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ప్రమాదకర పరిశ్రమలలో సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు కార్మిక భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.