కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేసిందని టీడీపీ అరకు ఇన్చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్నుదొర అన్నారు. సోమవారం అరకులోయ మండలం, బస్కీ, అనంతగిరి మండలం, ఎగువశోభ గ్రామాల్లో చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ప్రతి ఇంటికీ మంచి చేశాం : డా దొన్నుదొర