*🟨ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థులకు నగదు బహుమతులు అందించిన టీడీపీ నాయకుడు దువ్వూరు జనార్ధన్ రెడ్డి!**🟨నలుగురు మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున మొత్తం రూ.10,000 నగదు ప్రోత్సాహకం!**🟨విద్యార్థుల విజయాలను ఘనంగా అభినందించి, మరింత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఆకాంక్ష!**🟨”విద్యాభివృద్ధికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది” – దువ్వూరు జనార్ధన్ రెడ్డి**🟨గురుకుల పాఠశాల అభివృద్ధికి గతంలోనూ ఆర్థిక సహాయం చేసిన జనార్ధన్ రెడ్డి!**🟨విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు వ్యక్తిగతంగా ముందుకొచ్చిన టీడీపీ నాయకుడు!**🟨పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు–పాఠశాల కలిసి పనిచేయాలని పిలుపు!**🟨కోట బీసీ గురుకులంలో విద్యకు అండగా నిలిచిన దువ్వూరు జనార్ధన్ రెడ్డి సేవలు ప్రశంసనీయం!**———————* *✍🏽వినోద్ కుమార్ 👇🏽* *జర్నలిస్ట్**———————-*కోట మండలంలోని బీసీ గురుకుల పాఠశాల కళాశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం-2026 వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాల కీర్తిని ఇనుమడింపజేసిన నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులను టీడీపీ నాయకులు, కల్లూరు పంచాయతీ ఇంచార్జ్ దువ్వూరు జనార్ధన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.విద్యార్థుల్లో మరింత పోటీతత్వాన్ని పెంచేందుకు, వారి ఉత్సాహాన్ని ఇనుమడింపజేసేందుకు ఆయన తన సొంత ఖర్చులతో ఒక్కో విద్యార్థికి రూ. 2,500 చొప్పున మొత్తం రూ. 10,000 నగదు బహుమతిని అందజేసి ఆర్థిక చేయూతనిచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో దువ్వూరు జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులను ఆదర్శంగా తీసుకుంటూ విద్యా రంగానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గతంలోనూ ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థుల సౌకర్యాల కల్పన కోసం ఆర్థిక సహాయం అందించినట్లు గుర్తుచేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులోను రాణించాలని ఆకాంక్షించారు. అలాగే, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా పాఠశాల యాజమాన్యానికి పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.


