పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు
పున్నమి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు సిహెచ్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిహెచ్. వినోద్ కుమార్ మాట్లాడుతూ పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నతమైన పదవులు పొందాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కల్మషం లేని వ్యక్తి అని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అన్నదండగా ఉంటూ వారికి అండగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో షఫీ ఉల్లా, త్యాగరాజు, సంపత్, కంచుపాటి బాబు, నరసింహ కుమార్, శాంసన్, ప్రభుదాసు, అయ్యవారయ్య, అజయ్, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.





