Thursday, 16 July 2026
  • Home  
  • నారా భువనేశ్వరికి ఘన స్వాగతం..గుడిమల్లం వైభవాన్ని పరిచయం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

నారా భువనేశ్వరికి ఘన స్వాగతం..గుడిమల్లం వైభవాన్ని పరిచయం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 15, (పున్నమి న్యూస్): రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం విచ్చేసిన నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి ఆమెను ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన గుడిమల్లం పరశురామేశ్వరాలయ విశిష్టత, ఆలయ శిల్పకళా వైభవం, చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్‌ను నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహూకరించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుడిమల్లం ఆలయ వైశిష్ట్యాన్ని మరింత మందికి చేరవేసే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ బహుమతిని అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.