శ్రీ కాళహస్తి, జులై 15, (పున్నమి న్యూస్): తిరుపతిలో సోమవారం ఒక పాత్రికేయుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ పాత్రికేయుల సంఘం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై తక్షణమే చట్టపరమైన కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. వినతిపత్రం స్వీకరించిన డిఎస్పి నరసింహమూర్తి స్పందిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని, జర్నలిస్టుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తం హరిబాబు, ఉపాధ్యక్షులు కోట చంద్రశేఖర్, మోహన్ రాజ్, షేక్ జూమ్లేషా, పెరిమిడి రఘు, ముని చంద్ర, మునిరెడ్డి, పెంచలయ్య, సుధీర్, కృష్ణమూర్తి, జాకీర్, బాలు తదితర పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జర్నలిస్టుపై దాడి అనాగరికం-డిఎస్పికి ఏపీజేఎఫ్ వినతిపత్రం