Monday, 17 August 2026
  • Home  
  • ఈ నెల 19న కలెక్జటరేట్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి:ఏపిఆర్పిఏ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెల 19న కలెక్జటరేట్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి:ఏపిఆర్పిఏ

అమలాపురం ఎంప్లాయీస్ హోమ్‌లో కరపత్రాల ఆవిష్కరణ ​ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (ఏపిఆర్పిఏ) పిలుపు పున్నమి దినపత్రిక ​అమలాపురం, ఆగష్టు -17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈనెల ఆగస్టు 19వ తేదీ (బుధవారం) నాటి ‘చలో కలెక్టర్ కార్యాలయం’ ధర్నా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ( ఏపిఆర్పిఏ) నాయకులు పిలుపునిచ్చారు.​సోమవారం అమలాపురం ఎంప్లాయీస్ హోమ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు ఇందుకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు , జిల్లా అధ్యక్షులు కడలి సత్యనారాయణ( కేఎస్ఎన్) ప్రధాన కార్యదర్శి జి.వి. గోపాల కృష్ణ,ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన కోరికలు తీర్చమని పోరాటాలు చేస్తుంటే పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ​కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్లు కోరుతూ: ​కోట్లాదిమంది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రివాల్యుయేషన్ బిల్లు 2025ను తక్షణమే రద్దు చేయాలి. ​కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్‌సీ నివేదికను రప్పించి 01.01.2026 నుండి అమలు చేయాలి, అంతవరకు మధ్యంతర భృతి (IR) (ఐఆర్) చెల్లించాలి. ​ఈపీఎస్ 95 (ఈపిఎస్95) పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9,000/- మరియు డిఏ కలిపి చెల్లించాలి. ​హయ్యర్ పెన్షన్ అమలుపై కోర్టు తీర్పులను వెంటనే అమలు చేయాలి. ​ఎన్‌.పి.స్, సిపిస్,యుపిస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ​పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి. ​రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ: ​12వ పీఆర్‌సీ కమిషనర్ ను నియమించి 30% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలి. ​పెండింగ్‌లో ఉన్న ఐదు విడతల డి.ఎ (డిఏ) లను వెంటనే విడుదల చేయాలి. ​పెండింగ్ బకాయిలు రూ. 25 వేల కోట్లను విడతల వారీగా చెల్లించడానికి షెడ్యూల్ ప్రకటించాలి. ​సీపీఎస్ (సిపిస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపిస్) అమలు చేయాలి. ​కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి (రెగ్యులరైజ్ చేయాలి) ​ముఖ్యంగా అంగన్‌వాడీ, ఆశా, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు వేతనాల నుండి ఈపీఎఫ్ చందాను వసూలు చేసి పెన్షన్ సదుపాయం కల్పించాలి.​ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరియు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ పోరాటానికి తమ మద్దతు తెలియజేసి సంఘీభావం తెలపాలని కోరడమైనదని సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డి.శ్రీరామ్మూర్తి, కార్యదర్శులు ఎస్.కృష త్రిమూర్తులు, కండవల్లి శ్రీనివాస్, డి.నాగేంద్ర రాజు, పి.కొండలరావు, జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

అమలాపురం ఎంప్లాయీస్ హోమ్‌లో కరపత్రాల ఆవిష్కరణ

​ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (ఏపిఆర్పిఏ) పిలుపు

పున్నమి దినపత్రిక ​అమలాపురం, ఆగష్టు -17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈనెల ఆగస్టు 19వ తేదీ (బుధవారం) నాటి ‘చలో కలెక్టర్ కార్యాలయం’ ధర్నా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ( ఏపిఆర్పిఏ) నాయకులు పిలుపునిచ్చారు.​సోమవారం అమలాపురం ఎంప్లాయీస్ హోమ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు ఇందుకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు , జిల్లా అధ్యక్షులు కడలి సత్యనారాయణ( కేఎస్ఎన్) ప్రధాన కార్యదర్శి జి.వి. గోపాల కృష్ణ,ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన కోరికలు తీర్చమని పోరాటాలు చేస్తుంటే పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

​కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్లు కోరుతూ:

​కోట్లాదిమంది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రివాల్యుయేషన్ బిల్లు 2025ను తక్షణమే రద్దు చేయాలి.

​కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్‌సీ నివేదికను రప్పించి 01.01.2026 నుండి అమలు చేయాలి, అంతవరకు మధ్యంతర భృతి (IR) (ఐఆర్) చెల్లించాలి.

​ఈపీఎస్ 95 (ఈపిఎస్95) పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9,000/- మరియు డిఏ కలిపి చెల్లించాలి.

​హయ్యర్ పెన్షన్ అమలుపై కోర్టు తీర్పులను వెంటనే అమలు చేయాలి.

​ఎన్‌.పి.స్, సిపిస్,యుపిస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.

​పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి.

​రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ:

​12వ పీఆర్‌సీ కమిషనర్ ను నియమించి 30% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలి.

​పెండింగ్‌లో ఉన్న ఐదు విడతల డి.ఎ (డిఏ) లను వెంటనే విడుదల చేయాలి.

​పెండింగ్ బకాయిలు రూ. 25 వేల కోట్లను విడతల వారీగా చెల్లించడానికి షెడ్యూల్ ప్రకటించాలి.

​సీపీఎస్ (సిపిస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపిస్) అమలు చేయాలి.

​కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి (రెగ్యులరైజ్ చేయాలి)
​ముఖ్యంగా అంగన్‌వాడీ, ఆశా, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు వేతనాల నుండి ఈపీఎఫ్ చందాను వసూలు చేసి పెన్షన్ సదుపాయం కల్పించాలి.​ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరియు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ పోరాటానికి తమ మద్దతు తెలియజేసి సంఘీభావం తెలపాలని కోరడమైనదని సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డి.శ్రీరామ్మూర్తి, కార్యదర్శులు ఎస్.కృష త్రిమూర్తులు, కండవల్లి శ్రీనివాస్, డి.నాగేంద్ర రాజు, పి.కొండలరావు, జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.