Sunday, 6 September 2026
  • Home  
  • సోమశిల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆత్మకూరు డీఎస్పీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమశిల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆత్మకూరు డీఎస్పీ

సోమశిల పోలీస్ స్టేషన్‌ను ఆత్మకూరు డీఎస్పీ టి. వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసులకు సంబంధించిన దస్త్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందితో సమీక్షించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత, పారదర్శకత పాటిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలోని స్థానిక పరిస్థితులపై ఎస్సై అనూషతో చర్చించారు. విధుల నిర్వహణలో చురుకుదనం, సమర్థవంతమైన పనితీరును కనబరుస్తున్న సోమశిల ఎస్సై అనూషను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా పనిచేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.