Tuesday, 5 May 2026
  • Home  
  • తలకొండపల్లి మండలంలో అనిశాకు పట్టుబడ్డ పట్టు గ్రామపంచాయతీ కార్యదర్శి – రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో అధికారి!
- E-పేపర్

తలకొండపల్లి మండలంలో అనిశాకు పట్టుబడ్డ పట్టు గ్రామపంచాయతీ కార్యదర్శి – రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో అధికారి!

తలకొండపల్లి మండలంలో అనిశాకు పట్టుబడ్డ పట్టు గ్రామపంచాయతీ కార్యదర్శి – రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో అధికారి ! పున్నమి న్యూస్ ప్రతినిధి మే 2026 తెలంగాణ ఇంచార్జి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో అవినీతి బహిర్గతమైంది. మండలంలో ఏజైల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు శరత్ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో పట్టుకున్నారు. పర్మిషన్ కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో మండలంలో సంచలనం నెలకొంది. సాధారణ ప్రజల పనులకు అనుమతులు ఇవ్వడానికి కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో పన్నిన ఉచ్చులో కార్యదర్శి చిక్కడం గమనార్హం. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తలకొండపల్లి మండలంలో అనిశాకు పట్టుబడ్డ పట్టు గ్రామపంచాయతీ కార్యదర్శి – రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో అధికారి !

పున్నమి న్యూస్ ప్రతినిధి
మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా

తలకొండపల్లి మండలంలో అవినీతి బహిర్గతమైంది. మండలంలో ఏజైల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు శరత్ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో పట్టుకున్నారు. పర్మిషన్ కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనతో మండలంలో సంచలనం నెలకొంది. సాధారణ ప్రజల పనులకు అనుమతులు ఇవ్వడానికి కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో పన్నిన ఉచ్చులో కార్యదర్శి చిక్కడం గమనార్హం.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.