భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలం అభివృద్ధిలో వెనుకబడిందని స్థానికులు, కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా నిధుల మంజూరు జరగడం లేదని వారు అంటున్నారు. మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తయినా, కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. అప్పుల భారంతో కొత్త పనులు చేపట్టేందుకు కూడా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండలంలో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి కాంట్రాక్టర్లకు ఊరట కల్పించాలని, చర్ల మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధి, వ్యాపార అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చర్ల మండల అభివృద్ధిపై ఆవేదన.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎప్పుడూ?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలం అభివృద్ధిలో వెనుకబడిందని స్థానికులు, కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా నిధుల మంజూరు జరగడం లేదని వారు అంటున్నారు. మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తయినా, కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. అప్పుల భారంతో కొత్త పనులు చేపట్టేందుకు కూడా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండలంలో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి కాంట్రాక్టర్లకు ఊరట కల్పించాలని, చర్ల మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధి, వ్యాపార అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

