కలిగిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్త కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి, కలిగిరి మండల జడ్పీటీసీ పావులూరి మాల్యాద్రి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి, కలిగిరి మండల కన్వీనర్ కాటం రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



