ఉదయగిరి స్టేట్పేట వద్ద కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒరిగిన విద్యుత్ స్తంభం వాహనంపై పడటంతో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అయితే కేబుల్ ఆపరేటర్లు వైర్లను సరిచేయకుండా అలాగే వదిలేయడంతో అవి రోడ్డుపైకి వేలాడుతూ వాహనాలకు తగులుతున్నాయని స్థానికులు తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, కేబుల్ నిర్వాహకులు వెంటనే స్పందించి వైర్లను క్రమబద్ధీకరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు తరచూ తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఉదయగిరి స్టేట్పేట వద్ద ప్రమాదకరంగా కేబుల్ వైర్లు