Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

న్యాయ విద్య ఎంతో ఉత్కృష్టమైనది రాజ్యాంగ పరిరక్షణకు దోహదపడాలి ‘ లా’ విద్యార్థులకు అండగా ఉంటా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
న్యాయ విద్య ఎంతో ఉత్కృష్టమైనది రాజ్యాంగ పరిరక్షణకు దోహదపడాలి ‘ లా’ విద్యార్థులకు అండగా ఉంటా

వార్త ముఖ్యాంశాలు

  • అనంతా 'లా' కళాశాల వీడ్కోలు వేడుకల్లో డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి సమాజంలో ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేందుకు పలువురు తాపత్రయ పడుతున్న పరిస్థితుల్లో ఉన్నత ఆశయంతో' 'లా' విద్య అభ్యసించడం దేశానికి గర్వకారణమని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు డాక్టర్ చమరపాక…
  • మంగళవారం తిరుపతి కచ్ఛపీ సమావేశ మందిరంలో నిర్వహించిన అనంత న్యాయ కళాశాల చివరి సంవత్సర విద్యార్థుల వీడ్కోలు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవిద్య అనేది ఎంతో ఉత్కృష్టమైనదని సమాజంలో అన్ని వర్గాలకు హితము కోరుతూ రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయ వాదులు గొప్ప పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

అనంతా ‘లా’ కళాశాల వీడ్కోలు వేడుకల్లో డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి

సమాజంలో ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేందుకు పలువురు తాపత్రయ పడుతున్న పరిస్థితుల్లో ఉన్నత ఆశయంతో’ ‘లా’ విద్య అభ్యసించడం దేశానికి గర్వకారణమని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు డాక్టర్ చమరపాక దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి కచ్ఛపీ సమావేశ మందిరంలో నిర్వహించిన అనంత న్యాయ కళాశాల చివరి సంవత్సర విద్యార్థుల వీడ్కోలు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవిద్య అనేది ఎంతో ఉత్కృష్టమైనదని సమాజంలో అన్ని వర్గాలకు హితము కోరుతూ రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయ వాదులు గొప్ప పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సమాజంలో నిత్యం జరిగే ప్రతి సంఘటన సునిశిత దృష్టితో పరిశీలించినప్పుడే ఉత్తమ న్యాయవాదులుగా స్థిరపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్మిత అవుతున్న జిల్లా కోర్టు భవనాల భూమి పూజ కార్యక్రమంలో 15 రోజులపాటు అవిశ్రాంతగా కృషి చేశానని తెలిపారు. సుప్రీంకోర్టు సీజే సైతం తన సేవలను కొనియాడారని గుర్తు చేశారు. లా విద్యార్థులకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే తప్పక పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
కళాశాల పూర్వ విద్యార్థిని, ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మోహన్ లక్ష్మి గౌరవ అతిథిగా పాల్గొని కళాశాలో తాను అధ్యాపకులు నుండి లా అక్షరాభ్యాసం చేసేందుకు ఇచ్చినతోడ్పాటే నేటి ఈస్థాయికి రావడానికి కారణమని కొనియాడారు. కోర్టుల్లో ఎదురయ్యే సివిల్ క్రిమినల్ వాజ్యాలలో వాదనాల కైనా, తీర్పులకైనా కళాశాల పాఠ్యాంశంలోని సెక్షన్లు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. పరీక్షలో పాస్ అయ్యేందుకే చదవడం కాకుండా ఉత్తమమైన న్యాయవాదులుగా చలామణి అయ్యేందుకు లోతుగా అధ్యయనం చేస్తూ సూక్ష్మస్థాయి పరిశీలన ఎంతో ముఖ్యమని అన్నారు. తన ఉన్నతికి అధ్యాపకుల తో పాటు తన కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతో ఉందని పేర్కొన్నారు. కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డా.నటరాజ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి నిర్దేశకులుగా లా విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో రాణించాలని పేర్కొన్నారు. న్యాయ విద్యార్థులకు సమయపాలన ఎంతో ముఖ్యమైనదని తప్పక పాటిస్తే ఉన్నత స్థాయికి చేరవచ్చునని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిరి కుమార్ మాట్లాడుతూ న్యాయవిద్య పట్ల నేడు విద్యార్థులు మక్కువ పెరుగుతోందని ఎంతో బాధ్యతాయుతంగా వృత్తిని చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకలతోపాటు న్యాయస్థానాల తీర్పులను పరిశీలిస్తూ తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో నెగ్గిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా,కళాశాల రెండో సం// విధ్యార్థి కె.గురు రాజు, విజయ్ టీం నిర్వహించిన ఇంద్రజాలం,, మిమిక్రీ ఎంతగానో ఆకట్టుకున్నాయి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *