Tuesday, 18 August 2026
  • Home  
  • డ్రైవర్ను వెనక్కి పంపి.. గోదావరిలోకి దూకారు: తూ.గో: వేధింపుల వల్లే పంచాయతీరాజ్ AE కుటుంబం ఆత్మహత్యాయత్నం?
- తూర్పు గోదావరి

డ్రైవర్ను వెనక్కి పంపి.. గోదావరిలోకి దూకారు: తూ.గో: వేధింపుల వల్లే పంచాయతీరాజ్ AE కుటుంబం ఆత్మహత్యాయత్నం?

రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపైకి ఆదివారం రాత్రి 11.40 గంటలకు పిఠాపురం AE కారులో కుటుంబ సభ్యులు వచ్చారని CI శివాజీ తెలిపారు. వంతెన 80వ పిల్లర్ వద్దకు చేరుకొన్న తర్వాత డ్రైవర్ను వెనక్కి పంపించారని చెప్పారు. అనంతరం AE నూకరాజు (60), భార్య మీనా (58), కుమార్తె సౌజన్య, మనవడు కార్తీక్ గోదావరిలోకి దూకినట్లు వివరించారు. కార్తీక్ ప్రాణాలతో బయటపడగా, ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. తదుపరి రాజమండ్రి సమీపంలో గోదావరిలో అర్ధరాత్రి ఈదుకుంటూ కేకలు వేస్తున్న బాలుడు కార్తీకన్ను మత్స్యకారులు రక్షించారు. చేపల వేటలో ఉన్న సమయంలో కేకలు వినిపించడంతో పడవలో వెళ్లి బాలుడిని ఒడ్డుకు చేర్చినట్లు మత్స్యకారులు మీడియాకు తెలిపారు. అనంతరం బాలుడిని రాజమండ్రి టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. అతడి కుటుంబ సభ్యుల కోసం వెతికినా ఆచూకీ లభించలేదని మత్స్యకారులు వెల్లడించారు. పిఠాపురం పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. 2 నెలల క్రితం అల్లుడు మృతి చెందినప్పటి నుంచి సాధిక్ అనే వ్యక్తి సహాయకుడిగా ఉంటానంటూ తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడని నూకరాజు పేర్కొన్నట్లు సమాచారం. బ్యాంకు ఖాతాలు, విలువైన వస్తువులను తన ఆధీనంలో ఉంచుకున్నాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని నోట్లో పేర్కొన్నట్లు తెలిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.