Thursday, 3 September 2026
  • Home  
  • *కుప్పారెడ్డిపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు జోరుగా ప్రారంభం*
- తిరుపతి

*కుప్పారెడ్డిపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు జోరుగా ప్రారంభం*

*దొరవారిసత్రం మండలం, కుప్పారెడ్డిపాలెం*(తిరుపతి జిల్లా) గ్రామంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల చిరకాల కోరిక నెరవేరే దిశగా ఆలయ పునాది పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు, దాతలు, ఆలయ కమిటీ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పెద్దలైన *శ్రీ జమ్మల ఉమాపతి గారు, శ్రీ కిన్నెర హరిబాబు గారు* తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పనులను ముందుండి నడిపిస్తున్నారు. వారితో పాటు *శ్రీ బల్లి విజయ్ కుమార్ గారు, శ్రీ జమ్మల మనోహర్ గారు* మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం, భక్తుల కోసం *జమ్మల ఉమాపతి గారు, కిన్నెర హరిబాబు గారు* చేస్తున్న కృషి ఎనలేనిది. ఇలాంటి మంచి మనసున్న పెద్దలు మన ఊరిలో ఉండడం మన ఊరి అదృష్టం అని గ్రామస్తులు కొనియాడుతున్నారు. వారి సహకారంతో ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తై, స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయితే కుప్పారెడ్డిపాలెం గ్రామానికి మరింత ఆధ్యాత్మిక శోభ వస్తుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

*దొరవారిసత్రం మండలం, కుప్పారెడ్డిపాలెం*(తిరుపతి జిల్లా)

గ్రామంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల చిరకాల కోరిక నెరవేరే దిశగా ఆలయ పునాది పనులు వేగంగా సాగుతున్నాయి.

ఈ ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు, దాతలు, ఆలయ కమిటీ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పెద్దలైన *శ్రీ జమ్మల ఉమాపతి గారు, శ్రీ కిన్నెర హరిబాబు గారు* తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పనులను ముందుండి నడిపిస్తున్నారు. వారితో పాటు *శ్రీ బల్లి విజయ్ కుమార్ గారు, శ్రీ జమ్మల మనోహర్ గారు* మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు.

గ్రామ అభివృద్ధి కోసం, భక్తుల కోసం *జమ్మల ఉమాపతి గారు, కిన్నెర హరిబాబు గారు* చేస్తున్న కృషి ఎనలేనిది. ఇలాంటి మంచి మనసున్న పెద్దలు మన ఊరిలో ఉండడం మన ఊరి అదృష్టం అని గ్రామస్తులు కొనియాడుతున్నారు. వారి సహకారంతో ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తై, స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ నిర్మాణ పనులు పూర్తయితే కుప్పారెడ్డిపాలెం గ్రామానికి మరింత ఆధ్యాత్మిక శోభ వస్తుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.