కొత్తకోడూరులో అంగరంగ వైభవంగా శివలింగం నందీశ్వరుడు నాగ ప్రతిష్ట
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15( పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ):
మండలంలోని రైల్వే కోడూరు పట్టణంలోని కొత్త కోడూరులో కార్తీక పుణ్య మాసం శనివారం రోజు నూతనంగా నిర్మించిన పీఠంపై శివలింగం, నందీశ్వరుడు నాగ ప్రతిమల ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది . కొత్త రామాలయ సమీపంలో నూతనంగా శివ లింగం నాగ ప్రతిష్ట కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల ఆధ్వర్యంలో స్థానికులు దాతల సహకారంతో చేయించిన శివలింగం నాగ ప్రతిమలను తీసుకొచ్చి కలశ స్థాపన, హోమం , అభిషేకం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించి ఘనంగా ప్రతిష్టించారు ఈ కార్యక్రమానికి కొత్త కోడూరు వాసులు పాల్గొని శివనామస్మరణతో కార్తీక మాసంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్త యువకులు సుబ్రమణ్యం ఆచారి, సాయి ,సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, శివరాజు, శివరాం, కార్తీక్, రమణ స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.


