నిర్మల్ జిల్లా కామోల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్మించనున్న కళ్యాణ మండపానికి జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ రూ.25 వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.



