* షుగర్ ఉన్నవాళ్లు పొద్దున్నే తొడుక్కునేటప్పుడు చెప్పులను, రాత్రి పడుకునేటప్పుడు పాదాలను రోజూ పరీక్షించుకోవాలి…ఎందుకంటే షుగర్ ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్లకు కాళ్లలో నరాలు దెబ్బతిని, స్పర్శ తగ్గిపోయి కాళ్లకు చీల గుచ్చుకున్నా, ముల్లు గుచ్చుకున్నా నొప్పి తెలియక నడుస్తూ ఉంటారు. అది బాగా పుండుపడి కాలు తీసేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే రోజూ పొద్దున్నే చెప్పులు వేసుకునేటప్పుడు చెప్పులో చీల గాని, ముల్లు గాని ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం; రాత్రి పడుకునే ముందు పాదాలకు ఏమైనా గాయం అయ్యిందేమో అని పరీక్షించుకుంటే పాదాలని బాగా రక్షించుకోవచ్చు.



