అరకులోయ పరిసర ప్రాంతాల్లో ఢీ షో యాంకర్, నటుడు నందు హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఆదివారం నిర్మల కాన్వెంట్లో దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్, హీరో నందుపై కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో తమిళ సినిమాలో హీరోయిన్గా నటించిన నయన కథానాయికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా, సినిమా టైటిల్ను ఇంకా ఖరారు చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Uploaded Video:

